ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం.. టి.అగ్రహారానికి చెందిన శ్రీనివాసరావు సీఆర్పీఎఫ్లో.. 21 ఏళ్లపాటు పనిచేసి స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. ఉత్తర భారత దేశంలోని అనేకరాష్ట్రాల్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించిన శ్రీనివాసరావు.. గోధుముల సాగుపై అవగాహన తెచ్చుకున్నారు. కరోనా ప్రభావంతో.. ప్రజల ఆహారపు అలవాట్లు మారుతున్న విషయాన్ని గ్రహించారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు,.. అధికారుల సలహా తీసుకుని.. నల్ల గోదుముల సాగు చేశారు. వీటికి మార్కెట్‌లో మంచి ఆదరణ ఉంటుందంటున్నారు శ్రీనివాసరావు.
మూడు నెలల క్రితం సాగుచేసిన నల్లగోధుమ.. ఇప్పుడు కంకిదశకు వస్తోంది. సంప్రదాయపంటల సాగుతో ఏటా నష్టపోతున్న రైతులు.. శ్రీనివాసరావు పొలం వద్దకు వచ్చి.. నల్లగోధుమల సాగు గురించి ఆరా తీస్తున్నారు.