ప్రకాశం జిల్లా ఆధార్ కేంద్రాలు ప్రజలతో నిండిపోయాయి. తెల్లకార్డుదారులు ఈ- కేవైసీ చేయించుకుంటేనే ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు అందుతాయనే ప్రభుత్వ ప్రకటనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.... ఓ పక్క సర్వర్ సమస్యలు మరోపక్క పిల్లల వేలు ముద్రలు ఈ- కేవైసీలో రాకపోవటంతో ఆధార్ కేంద్రాలను కార్డు దారులు ఆశ్రయిస్తున్నారు.... దీంతో ప్రకాశం జిల్లా చీరాల లోని ప్రధాన తపాలా కార్యాలయం,పర్చూరు పోస్ట్ ఆఫీసుల వద్ద ఆధార్ అప్ డేట్ చేయించుకునేందుకు ప్రజలు బారులు దిరారు. ఉదయం 8 గంటలకే పిల్లలతోసహా పోస్ట్ ఆఫీసుకు వచ్చారు.ఎక్కడ తమకు అందాల్సిన పథకాలు అందకుండా పోతాయని ప్రజల్లో ఆందోళన నెలకొంది.ఎలాగైనా ఆధార్ అనుసంధానం పూర్తిచేసుకుని వెళ్ళాలనే ఉద్దేశ్యంతో గంటలతరబడి క్యూలైన్లులో వేచి ఉంటున్నారు... చీరాలలో నాలుగుకేంద్రాలే పనిచేస్తున్నాయి. వీటిలోనూ ప్రధాన తపాలకేంద్రం మినహా మిగిలిన కేంద్రాల్లో సేవలు సరిగా అండటంలేదని పలువులు చెపుతున్నారు.
ప్రభుత్వం నిర్ణయంతో... ప్రజల్లో ఆందోళన - ప్రకాశం జిల్లా
తెల్లకార్డుదారులు ఈ- కేవైసీ చేయించుకుంటేనే ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు అందుతాయనే ప్రభుత్వ ప్రకటించింది.దీంతో ప్రజలు ఆధార్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. ప్రకాశం జిల్లాలోని ఆధార్ కేంద్రాలు ప్రజలతో కిటకిటలాడుతున్నాయి.
ఆధార్ కేంద్రాలు వద్ద బారులు తీరన తెల్లకార్డుదారులు