ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాజకీయాల నుంచి తప్పుకోవడమే ఉత్తమం: రామకృష్ణ - RAMAKRISHNA

రాష్ట్రంలో ఎన్నికల తీరుపై చంద్రబాబు ప్రశ్నలకు ఈసీ సమాధానం చెప్పాలని సీపీఐ కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. అధికార పార్టీతో సమానంగా... కేసీఆర్ పంపిన రూ.600 కోట్లు జగన్ రాష్ట్రంలో పంచేశారని రామకృష్ణ ఆరోపించారు.

cpm-ramakrishna

By

Published : Apr 16, 2019, 4:44 PM IST

మేము రాజకీయాలనుంచి తప్పుకోవడమే ఉత్తమం: రామకృష్ణ

ఎన్నికలు జరపడం కంటే... వేలం వేసి అభ్యర్థులు గెలిచినట్లు ప్రకటించడం ఉత్తమమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అభిప్రాయపడ్డారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో మీడియాతో మాట్లాడిన ఆయన... ఇలాంటి రాజకీయాలు నడిస్తే తమలాంటి పార్టీలు రాజకీయాలు నుంచి తప్పుకోవడం మంచిదని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో జరిగిన ఎన్నికలపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో... ఈసీ సమాధానం చెప్పాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. అధికార పార్టీతో సమానంగా జగన్.. కేసీఆర్ పంపిన రూ.600 కోట్లు రాష్ట్రంలో పంచారని ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details