దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐ ఆందోళనలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో సీపీఐనాయకులు ధర్నా నిర్వహించారు. పట్టణంలోని సీపీఐ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. అనంతరం మహిళలపై దాడులు జరగకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు తహసీల్దార్ కె.నెహ్రు బాబుకు వినతిపత్రంను అందజేశారు.
మహిళలపై దాడులను నిరసిస్తూ సీపీఐ నిరసన - yarragindapalem
దేశంలో మహిళలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ సీపీఐ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు.
cpi leaders protests at yarragindapalem at prakasham district