పురపాలక, నగరపాలక సంస్థల్లో కనిపించే ఉద్యానవనాలు ఇప్పుడు పల్లెల్లోను కనిపించనున్నాయి. గ్రామీణులకు ఆహ్లాదకర వాతావరణాన్ని పంచేందుకు...పల్లెలు అభివృద్ధి చెందాలనే దిశగాను ఈ పార్కులను నిర్మించేందుకు ప్రభుత్వం సిద్దమైంది. ప్రకాశం జిల్లాలోని కొన్ని మండలాల్లో వీటి నిర్మాణాలు పూర్తికాగా మరి కొన్ని ప్రాంతాల్లో పనులు జరుగుతున్నాయి. ఈ ఉద్యానవనంలో వివిధ రకాల పులా మొక్కలు, మెహంది, డిజైన్ మొక్కలు, వేప తదితర మొక్కలను ఏర్పాటు చేస్తున్నారు. నిడనిచ్చే చెట్లు, పిల్లలు ఆడుకొనేందుకు, గ్రామాల్లో అరుగుల మీద, చెట్ల కింద కబుర్లు చెప్పుకొనే వృద్దులకు ఇది మంచి చోటని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అర ఎకరం స్థలంలో రూ.4 లక్షలు, ఎకరా స్థలంలో రూ.8 లక్షలు చొప్పున ఖర్చు చేసి ఉద్యానవనాలు ఏర్పాటు చేస్తున్నారు.
మనసుకు ఉల్లాసాన్నిచ్చేందుకే ఉద్యానవనాలు - yerragondapalem
పట్టణాల్లోనే కాకుండా ఇప్పుడు గ్రామీణులకు సైతం ఆహ్లాదకర వాతవరణాన్ని పంచేందుకు పల్లె వనాలను అభివృద్ధి చేస్తుంది ప్రభుత్వం. ఇక్కడకు వస్తే ఆ స్వచ్ఛమైన గాలికి, పక్షుల కిలకిల రావాలు...మనసుకెంతో ఉల్లాసాన్నిస్తుంది.
Breaking News