రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా పంజా విసురుతోంది. కరోనా కట్టడి చేసేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో కొత్తగా మరో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దిల్లీ నుంచి మార్కాపురం వచ్చిన ఓ యువకునికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. అధికారులు బాధితున్ని ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 40కి చేరుకుంది.
జిల్లాలో మరో ఇద్దరికి కరోనా.. 40కి చేరిన కేసుల సంఖ్య - corona updated news in prakasam
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రకాశం జిల్లాలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కరోనా కట్టడికి అధికారులు శ్రమిస్తున్నారు.
జిల్లాలో మరో ఇద్దరికి కరోనా.. 40కి చేరిన కేసుల సంఖ్య