ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మహిళలు చదువుకుంటే సమాజం బాగుపడుతుంది'

ప్రకాశం జిల్లా ఒంగోలులో కోరమాండల్ సంస్థ ఆధ్వర్యంలో గ్రామీణ బాలికల ప్రతిభా పురస్కారాల కార్యక్రమం నిర్వహించారు. తొమ్మిదో తరగతిలో ప్రతిభ చూపిన విద్యార్థినిలకు అవార్డులు అందజేశారు.

coramandal talent awards in ongole
విద్యార్థినికి పురస్కారం అందజేస్తున్న కోరమాండల్ సంస్థ నిర్వాహకులు

By

Published : Feb 26, 2020, 11:07 AM IST

కోరమాండల్ సంస్థ ఆధ్వర్యంలో ఒంగోలులో ప్రతిభా పురస్కారాలు

గ్రామీణ ప్రాంతాల్లో మహిళలను విద్యాధికులను చేస్తే సమాజం అభివృద్ధి పథంలో నడుస్తుందని, ఆ దిశగా మహిళలను విద్యావంతులను చేసేందుకు తమ సంస్థ పనిచేస్తోందని మురుగప్ప కోరమాండల్ సంస్థ నిర్వహకులు సుబ్బారెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో గ్రామీణ బాలికల ప్రతిభా పురస్కారాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 9వ తరగతిలో విశేష ప్రతిభ చూపించిన విద్యార్థినులకు అవార్డులు అందజేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తమ సంస్థ తరఫున ఏటా చదువులో ప్రతిభ చూపిన బాలికలకు ఈ పురస్కారాలు అందజేస్తున్నామని సుబ్బారెడ్డి అన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details