ప్రకాశం జిల్లాలో వినాయక నిమజ్జనం సందర్భంగా సముద్రంలోకి దిగిన యువకులు ప్రాణాపాయస్థితిలో ఉండగా పోలీసులు కాపాడారు. కొత్తపట్నం సముద్రంలో ఒంగోలుకు చెందిన గణేష్ కమిటీ సభ్యులు వినాయుడిని నిమజ్జనం చేసేందుకు సముద్రంలోకి దిగగా.. వెంటనే అలలు రావడం వల్ల లోతులోకి వెళ్ళారు. సముద్రంలో కొట్టుకుపోతున్న ఇద్దరిని పోలీసులు కాపాడారు. వెంకటరావు, షేక్ రబ్బానీలు తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. అదేవిధంగా సింగరాయికొండ మండలం పాకాల వద్ద కూడా ఓ బాలుడు సముద్రంలో కొట్టుకుపోతుండగా పోలీసులు గమనించిన కాపాడి ఒడ్డుకు చేర్చారు. అప్పటికే అపస్మారక స్థతిలో ఉన్న ఈ బాలుడికి తక్షణం వైద్యం అందించడంతో కోలుకున్నాడు.. పోలీసుల చొరవను పలువురు ప్రశంసిస్తున్నారు.
సముద్రంలో కొట్టుకుపోతున్న యువకులను కాపాడిన పోలీసులు - stranded
వినాయకుని నిమజ్జనంలో భాగంగా సముద్రంలోని అలలకు కొట్టుకపోతున్న యువకులను పోలీసులు కాపాడారు. అనంతరం వారికి చికిత్సను అందించారు.
Cops saved teenagers stranded at kottapatnam sea in prakasham district