ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలంలో కరోన కేసులు పెరుగుతున్నందున ఆగస్టు రెండు నుంచి నాలుగు రోజులపాటు పట్టణంలో సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తున్నామని సీ.ఐ దేవా ప్రభాకర్ తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో వ్యాపారుల సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఆయన... కరోనా కట్టడి కోసమే ఈ లాక్డౌన్ విధిస్తున్నామన్నారు. రేపటి నుంచి ఆగస్టు ఒకటి వరకు నిత్యావసర దుకాణాలకు.. ఉదయం 10 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. లాక్డౌన్లో ఎవరూ దుకాణాలు తెరవరాదని.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.
ఆగస్టు రెండు నుంచి యర్రగొండపాలెంలో సంపూర్ణ లాక్డౌన్
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. అప్రమత్తమైన పోలీసులు.. పట్టణంలో ఆగస్టు రెండో తేదీ నుంచి నాలుగు రోజుల పాటు సంపూర్ణ లాక్డౌన్ అమలు చేయాలని నిర్ణయించారు.
ఆగస్టు రెండు నుంచి యర్రగొండపాలెంలో సంపూర్ణ లాక్డౌన్