ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రధానోపాధ్యాయురాలిపై ఫిర్యాదులు.. విచారణ ప్రారంభం - దర్శి

ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఆదర్శంగా నిలవాల్సిన ప్రధానోపాధ్యాయురాలు ఆమె. కానీ.. ఆమెపైనే పలు అభియోగాలు నమోదయ్యాయి. ప్రతి పనికి డబ్బులు వసూలు చేస్తున్నారనీ.. తాత్కాలిక ఉద్యోగులను ఏ కారణం లేకుండా తొలగిస్తున్నారని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆరోపించారు.

ప్రధానోపాధ్యాయురాలిపై ఫిర్యాదులు.. విచారణ ప్రారంభం

By

Published : Aug 12, 2019, 12:31 PM IST

ప్రధానోపాధ్యాయురాలిపై ఫిర్యాదులు.. విచారణ ప్రారంభం

ప్రకాశం జిల్లా దర్శి పట్టణం సాయినగర్​లోని ఏపీ మోడల్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలి​పై.. విద్యార్థుల తల్లిదండ్రులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. బడిలో సీటు ఇప్పిస్తానని రూ. 10 నుంచి 15వేల వరకు వసూలు చేశారని ఆరోపించారు. విద్యార్థులకు స్టడీ, టీసీ వంటి ధ్రువపత్రాలు ఇవ్వడానికి... డబ్బులు తీసుకుంటున్నారని తెలిపారు. పాఠశాలలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులూ ఆమెపై ఫిర్యాదు చేశారు. ఎలాంచి కారణం లేకుండా తమను ఉద్యోగంలోనుంచి తీసేశారన్నారు. వీటిపై స్పందించిన విద్యాశాఖ అధికారులు విచారణ నిమిత్తం ఏడీ నాగరాజును నియమించారు. ఆయన పిల్లల తల్లిదండ్రులను విచారించారు. త్వరలోనే నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తానని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details