ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలో పరిశ్రమల కారిడార్ కోసమని గత ప్రభుత్వం కొంత ప్రభుత్వ భూములను కేటాయించింది. ఆ కారిడార్లో ప్రస్తుత పరిస్థితిని జిల్లా కలెక్టర్ భాస్కర్, జాయింట్ కలెక్టర్ షన్మోహన్ పరిశీలించారు. అనుమతులు ఇచ్చినా పరిశ్రమలు ఏర్పాటు కాకుండా ఉన్న భూముల వివరాలు తెలుసుకున్నారు. కొత్త ఇండస్ట్రీల ఏర్పాటుకు ఉన్న అవకాశాలు తెలుసుకున్నారు. అనంతరం... కురుచేడు మండలం నాయుడుపాలెం వద్ద ఉన్న అటవీ భూములను పరిశీలించారు.
అనుమతులు ఇచ్చిన చోట.. పరిశ్రమలు ఏర్పాటు చేశారా? లేదా? - undefined
ప్రకాశం జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్, జాయింట్ కలెక్టర్ షన్మోహన్.. దొనకొండ మండలంలో పర్యటించారు. పరిశ్రమల ఏర్పాటుకు గతంలో కేటాయించిన భూములు పరిశీలించారు.
కలెక్టర్, జాయింట్ కలెక్టర్ పర్యటన