పోలవరం నీళ్లతో ప్రకాశం జిల్లాని తడుపుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. త్వరలోనే వెలుగొండ ప్రాజెక్టు టన్నెల్-1 పూర్తి చేసి జిల్లాకు నీళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఒంగోలునిఅభివృద్ధిపరంగా మరోస్థాయికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. తనను చూసే ఆసియా పల్ఫ్ అండ్ పేపర్ సంస్థ జిల్లాలో 25 వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతోందని అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు నెల్లూరు జిల్లాలోని తడ వరకు బీచ్ రోడ్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దీనివల్ల పారిశ్రామికంగా, పర్యాటకంగా జిల్లా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. అలాగే పసుపు-కుంకుమ పథకం కింద డ్వాక్రా మహిళలకు తుది విడతనిధులు, అన్నదాత పథకం కింద రైతులకు మొదటివిడత ఏప్రిల్ మొదటి వారంలో ఇస్తానని ప్రకటించారు.