ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మట్టివినాయకుడే ముద్దు.... ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వద్దు - ప్రకాశం జిల్లా

వినాయకచవితి వచ్చిందంటే ఊరూ-వాడా, చిన్నా- పెద్దా తేడాలేకుండా గణనాథుడి విగ్రహాలు ప్రతిష్ఠించి పూజలు చేస్తుంటారు. సుమారు 11రోజులపాటు జరిగే ఈ పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తారు. బొజ్జ వినాయకుడి నిమజ్జనం కార్యక్రమం కోలాహలంగా సాగుతుంది. అంతా బాగానే ఉంది. కానీ ఇలా చేసిందానికి ఫలితంగా మనకు కలిగేది... విపరీతమైన కాలుష్యం... దీనికి ప్రత్యాయ్నమాయం ఏం లేదా?... ఎందుకులేదు... కచ్చితంగా ఉంది అంటున్నారు ఒంగోలుకు చెందిన మేడికొండ రచన. ఆమె కథ ఎంటో చూసొద్దాం!

మట్టివినాయకుడే ముద్దు.... ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వద్దు

By

Published : Aug 28, 2019, 12:04 PM IST

ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన మేడికొండ రచన అనే యువతి సేవ్​ పౌండేషన్‌ అధినేత విజయరామ్‌ స్పూర్తితో సేవాకార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే మట్టి వినాయకుడి విగ్రహాల తయారీకి శ్రీకారం చుట్టారు. మూడేళ్ళు నుంచి పర్యావరణానికి హాని కలిగించని వస్తువులతో విగ్రహాలు తయారు చేయిస్తూ, విక్రయిస్తున్నారు.. కేవలం ప్రతిమ తయారీకి అయ్యే ఖర్చే వసూలు చేస్తారు. 3 అడుగుల నుంచి 6, 7 అడుగుల ఎత్తుల విగ్రహాలు తయారు చేస్తున్నారు. కలకత్తా నుంచి కార్మికులను తీసుకొచ్చి 4నెలలు ఈ పని చేస్తారు. ప్లాస్ట ఆఫ్‌ పారిస్‌తో కలిగే అనర్థాలు ప్రజలకు వివరిస్తూ మట్టి విగ్రహాలు వినియోగించేలా ప్రోత్సహిస్తున్నారామె.

చెరువులో మట్టి, ఎండుగడ్డి, వెదురు కర్రలు, ధాన్యపు ఊకతో బొమ్మ తయారు చేస్తారు. ఎండిన మట్టి బొమ్మపై గంగానది నుంచి ప్రత్యేకించి తీసుకువచ్చిన ఒండ్రు పూస్తారు. ఈ విగ్రహంతోపాటు ఖద్దరు పంచె, దోవతి ఇస్తారు. డ్వాక్రా సంఘాలు తయారు చేసిన నారా సంచితో ఓ కిట్‌ ఇస్తారు. ఈ ప్రయోగం వల్ల పర్యావరణమే కాకుండా ఖద్దరు, జ్యూట్‌ కార్మికులకూ ఉపాధి కల్పిస్తున్నారు.

రచన శ్రమ క్రమంగా ఫలిస్తోంది. ఎంతో మంది స్ఫూర్తి పొంది పర్యావరణ హిత విగ్రహాలనే వినియోగిస్తున్నారు.

ముక్కోటి దేవుళ్లలో నిమజ్జనం చేయగలిగే దేవుడు ఒక్క గణనాథుడే... కాబట్టి మట్టితో చేసిన విమాయకుడే నిమజ్జనానికి వీలవుతుందంటున్నారు రచన.

మట్టివినాయకుడే ముద్దు.... ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వద్దు

ఇదీచూడండి

అక్టోబరులో బంగార్రాజు సందడి షురూ..?

ABOUT THE AUTHOR

...view details