ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వాల్తేరు వీరయ్య నిలిపేయడంతో థియేటర్‌ వద్ద అభిమానుల ఆందోళనలు - Protest at cinema hall

Chiranjeevi fans protest: వాల్తేరు వీరయ్య సినిమా విడుదలై అందరినీ ఆకట్టుకుంది... దీంతో చిరు అభిమానులు ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. కానీ ప్రకాశం జిల్లాలోని ఓ థియేటర్​లో వాల్తేరు వీరయ్య స్థానంలో తమిళ నటుడు విజయ్ నటించిన వారసుడు సినిమాను ప్రదర్శించేందుకు టిక్కెట్లను థియేటర్‌ యాజమాన్యం జారీ చేయగా చిరంజీవి అభిమానులు ఆందోళనకు దిగారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా వేరే సినిమాను ప్రదర్శించడం ఏమిటని నిలదీశారు.

Chiranjeevi fans protest
వాల్తేరు వీరయ్య నిలిపేయడంతో థియేటర్‌ వద్ద భారీగా ఆందోళనలు

By

Published : Jan 14, 2023, 8:03 PM IST

వాల్తేరు వీరయ్య నిలిపేయడంతో థియేటర్‌ వద్ద భారీగా ఆందోళనలు

Chiranjeevi fans protest: ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలోని శ్రీనివాస సినిమా హాల్ వద్ద చిరంజీవి అభిమానులు ఆందోళన చేశారు. శ్రీనివాస సినిమా థియేటర్​లో నిన్న వాల్తేరు వీరయ్య సినిమా విడుదలైంది. అయితే భోగి పండుగ రోజు వాల్తేరు వీరయ్య సినిమా స్థానంలో.. తమిళ నటుడు విజయ్ హీరోగా నటించిన వారసుడు సినిమాను ప్రదర్శించేందుకు టిక్కెట్లను జారీ చేస్తుండడంతో... విషయం తెలుసుకున్న చిరంజీవి అభిమానులు భారీ సంఖ్యలో సినిమా హాలు వద్దకు చేరుకుని ఆందోళన చేశారు.

ముందస్తు సమాచారం లేకుండా... వాల్తేరు వీరయ్య సినిమా నిలిపివేసి వారసుడు చిత్రాన్ని ప్రదర్శించడం ఏంటని ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు సినిమా హాలు వద్దకు చేరుకోని.. ఆందోళన చేస్తున్న చిరంజీవి అభిమానులను విషయం అడిగి తెలుసుకున్నారు. అనంతరం చిరంజీవి అభిమానులకు నచ్చచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ.. వారు ససేమిరా అన్నారు. ఫలితంగా సినిమా థియేటర్​లో ఏ సినిమాను ప్రదర్శించకుండా పోలీసులు మూసివేయించారు. దీంతో సమస్య సద్దుమణిగింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details