ప్రకాశం జిల్లా చీరాలలో రేపు పోలీసుల 30 యాక్టు, 144వ సెక్షన్ అమలు చేస్తున్నట్లు ఒకటవ పట్టణ ఎస్ఐ సురేష్ తెలిపారు. రేపు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా పట్టణంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు గాను.. ర్యాలీలు, ధర్నాలు, ఊరేగింపులు, సమావేశాలు నిర్వహించరాదన్నారు. సమావేశాలు నిర్వహించాలంటే పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని కోరారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రేపు జాతీయ చేనేత దినోత్సవం.. చీరాలలో 144 సెక్షన్ - chirala
రేపు జాతీయ చేనేత దినోత్సవం సందర్బంగా ప్రకాశం జిల్లా చీరాలలో పోలీసులు 144వ సెక్షన్ విధించనున్నారు.
బుధవారం చీరాలలో 144 సెక్షన్ అమలు