ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆంధ్రావాళ్ల జోలికి ఎవరు వచ్చినా వదలను: సీఎం - తెదేపా ప్రచార సభ

తెలుగుజాతి వైభవం కోసం తెదేపానే తిరిగి అధికారంలోకి రావాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. ఎవరైనా ఆంధ్రావాళ్ల జోలికి వస్తే వదిలి పెట్టేది లేదని హెచ్చరించిన సీఎం .... రాష్ట్ర ప్రజల్ని  దగా చేసిన మోదీని దిల్లీ నుంచి గుజరాత్‌కు పంపిస్తామన్నారు.

అద్దంకి సభలో చంద్రబాబు

By

Published : Apr 4, 2019, 9:53 PM IST

Updated : Apr 5, 2019, 7:24 AM IST

అద్దంకి సభలో చంద్రబాబు
ఏపీకి విరోధైన కేసీఆర్‌కి ఊడిగం చేస్తారా అని ప్రకాశం జిల్లా అద్దంకి ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబు వైకాపా నాయకులను ప్రశ్నించారు. మోదీ, కేసీఆర్‌తో వైకాపా లాలూచీ పడిందని ఆరోపించారు. కేసీఆర్ తెలివితేటలు తన దగ్గర పనికి రావని హెచ్చరించారు. తెలంగాణ నుంచి ఏపీకి రూ.లక్ష కోట్లు రావాలని స్పష్టం చేశారు. అవసరమైతే కోర్టుకు వెళ్లి రాష్ట్ర వాటా సాధించుకుంటామని హెచ్చరించారు. డిసెంబరు నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తానని చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. రూ.6,200 కోట్లతో సాగర్‌ కుడికాల్వకు నీళ్లు తెస్తామని వెల్లడించిన బాబు... పోలవరంపై మోదీ అబద్ధాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన మోదీని దిల్లీ నుంచి గుజరాత్‌కు పంపిస్తామన్నారు. ఏడాదిలోగా ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతిరోజు లోటస్‌పాండ్‌లో కుట్రలు చేస్తున్నారన్న బాబు.. మైలవరంలో వైకాపా కార్యకర్తల రౌడీయిజం దారుణమని ఆగ్రహించారు. శాంతిభద్రతలు కాపాడేందుకు దేనికైనా సిద్ధమేనని... రౌడీలు శాశ్వతంగా జైలులో ఉండేలా చూస్తాననీ చెప్పారు. ఒక్కసారి ఏమారితే ఏపీ మరో బిహార్‌లా తయారవుతుందన్న సీఎం.. ఆంధ్రుల పూర్వ వైభవం కోసం మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వమే రావాలన్నారు.
Last Updated : Apr 5, 2019, 7:24 AM IST

ABOUT THE AUTHOR

...view details