కష్టపడే తత్వం, నిరంతర శ్రమ ఉండాలే గాని ఎంతటి విజయానైనా సాధించవచ్చని నిరూపించాడు ఓ యువకుడు. ప్రకాశం జిల్లా దర్శికి చెందిన హరిబాబు..ఇటీవల విడుదలైన సీఎంఏ ఫలితాల్లో జాతీయస్థాయి 18వ ర్యాంకు సాధించి...అందరికీ ఆదర్శంగా నిలిచాడు.
దర్శి కుర్రాడు... సీఎంఏలో 18వ ర్యాంకు కొట్టాడు! - cma
సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన..చదువుల్లో రాణిస్తూ జాతీయస్థాయిలో గుర్తింపు పొందాడు దర్శి చెందిన హరిబాబు. సీఎంఏ ఫలితాల్లో జాతీయస్థాయిలో 18వ ర్యాంకు సాధించి..ఆదర్శంగా నిలిచాడు.
చిన్నప్పట్నుంచి చదువులో రాణించిన హరిబాబుకు సీఏ చేయాలన్నదే లక్ష్యం. అందుకు గాను విజయవాడలోని సూపర్ విజ్ అనే కోచింగ్ అకాడమిలో చేరాడు. సీఏ చదువుతూనే సీఎంఏ పూర్తి చేయాలని సంకల్పించాడు. కష్టపడి చదివి జాతీయస్థాయిలో 18 ర్యాంకు సాధించాడు.
ఈ నెల 15న ఇన్ట్సిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా, కలకత్తా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో హరిబాబుకు బంగారు పతాకాన్ని అందించారు. తమ కుమారుడికి జాతీయ స్థాయిలో గుర్తింపు రావడంపై హరిబాబు తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరిన్నీ విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నారు.