ప్రకాశం జిల్లా కురుచేడు మండలం ఆవులమందలో బుద్ధుని అవశేషాలు బయటపడ్డాయి. ఈ ఆనవాళ్లు రెండవ శతాబ్దకాలం నాటికి చెందినవిగా చారిత్రక పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రాంతానికి దగ్గరలోని చందవరం బౌద్ధారామ క్షేత్రానికి.. బొల్లికొండరాయ క్షేత్రానికి సంబంధం ఉన్నట్లుగా వారు అభిప్రాయపడ్డారు.ఈ ప్రాంతాన్ని ప్రభుత్వం గుర్తించి పురావస్తుశాఖ వారిచే పరిశోధనలు జరిపించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఆవులమందలో బుద్ధుని అవశేషాలు లభ్యం - ongole
బౌద్ధమత స్థాపకుడైన బుద్ధుని అవశేషాలను ప్రకాశం జిల్లా ఆవులమంద ప్రాంతంలో గుర్తించారు. ఆనవాళ్లు రెండవ శతాబ్దకాలం నాటికి చెందినవిగా చారిత్రక పరిశోధకులు వెల్లడిస్తున్నారు.
ఆవులమందలో బుద్ధుని అవశేషాలు లభ్యం