ప్రకాశం జిల్లా చీరాల మండలం వాడరేవు సముద్రతీరంలో దృష్ట సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. జయశాలి క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ మొదటి షాట్ కు డాక్టర్ వరికూటి ఆమృతపాణి క్లాప్ కొట్టారు. కామాక్షి కేర్ ఆసుపత్రి అధినేత తాడివలస దేవరాజ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
నిర్మాత సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. సమాజంలో జరుగుతున్న మూడనమ్మకాలతో ఎంతో మంది ప్రాణాలు కొల్పోతున్నారన్నారు. ఇలాంటివాటికి నిర్మూలించాలన్న లక్ష్యంతో దృష్ట చిత్రం నిర్మిస్తున్నామని చెప్పారు. చిత్రంలో.. ఆర్.విజయ్, వడ్డే మహేశ్వరి అగర్వాల్, ముస్కాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.