ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెరుగుతున్న కొవిడ్ కేసులు.. చాలని పడకలు - Beds Shortage in chirala Area hospital

కరోనా మహమ్మారి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. చీరాల నియోజకవర్గ పరిధిలో రోజుకు వందకుపైగా కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ తరుణంలో చీరాల ఏరియా ఆస్పత్రిలో పడకల కొరత వేధిస్తోంది.

Beds Shortage in chirala Area hospital
Beds Shortage in chirala Area hospital

By

Published : May 15, 2021, 9:32 AM IST

ప్రకాశం జిల్లా చీరాలలో కొవిడ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో పడకల కొరత ఎదురవుతోంది. నియోజకవర్గ పరిధిలో రోజుకు వందకు పైగా కేసులు నమోదవుతున్నాయి.. శుక్రవారం ఒక్కరోజే 120 కేసులు వెలుగుచూశాయి.. సమస్య తీవ్రంగా ఉన్నవారంతా చీరాల ఏరియా ఆసుపత్రిలొనే చేరుతున్నారు. ప్రైవేటుగా పరీక్షలు చేయించుకుని పాజిటివ్​గా తేలినవారు కూడా ఇక్కడికే వస్తున్నారు.

ఆక్సిజన్ స్థాయిలు పడిపోయి ఊపిరి ఆడక ఇబ్బందులు పడుతున్న వారిని ఒంగోలు తరలిస్తున్నారు. చీరాల ప్రభుత్వాసుపత్రిలో 90 పడకలకే ఆక్సిజన్ సౌకర్యం ఉంది.. తొలుత 50 పడకలకే ఈ సౌకర్యం ఉండేది.. ప్రస్తుతం ఐసీయూలోని పడకలను కూడా కొవిడ్ బాధితులకే కేటాయించారు. ఇక్కడ 110 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇటీవల ప్రభుత్వ మోడల్ పాఠశాలలో ఏర్పాటుచేసిన కొవిడ్ కేర్ సెంటర్​లో 150 పడకలు ఏర్పాటు చేయగా... 92 మంది అక్కడ చికిత్స తీసుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details