Waterfalls in Bhairavakona: ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురం మండలంలోని భైరవకోనలో జలపాతం పర్యాటకులను, ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తోంది. ఎత్తైన కొండల పైనుంచి జాలువారుతున్న జలపాతం, దానినుంచి వచ్చే తెల్లటి నురగ, పొగమంచులాగా పడుతున్న నీటితుంపర్లు, చల్లటి వాతావరణంలో పక్షుల కిలకిల సవ్వడులు పర్యాటకుల మనసును దోచేస్తున్నాయి. అంతేకాదు జలపాతాన్ని ఆనుకుని ఒకే రాతి కింద ఎనిమిది శివాలయాలతో కూడిన శ్రీ త్రిముఖ దుర్గాంబా దేవి ఆలయంలో వున్న అమ్మవారి పాదాలను కడిగినట్లుగా పారుతున్న నీళ్లు పర్యాటకుల మదిని అట్టే కట్టిపడేస్తుంది. ఈ పకృతి సిద్ధమైన అందాలను చూసేందుకు పర్యాటకులు పలు రాష్ట్రాల నుండి సైతం అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. ప్రకృతి సిద్దంగా ఏర్పాటైన అందాలను చూస్తున్న పర్యాటకులు అనందంతో తన్మయత్వం చెందుతున్నారు
ఆహా ఏమి సోయగాలు.. ఈ అందాలను మాటల్లో వర్ణించతరమా - waterfalls in prakasam district
Waterfalls in Bhairavakona: గలగలమంటూ సాగే నీటి సవ్వడులు... వినసొంపైన పక్షుల కిలకిల రావాలు... పర్యాటకుల మదిని దోచి, ప్రకృతి ప్రేమికులకు చూడముచ్చటైన అందాలను ఆరబోసినట్లుగా కనువిందు చేస్తున్న దృశ్యాలు... ఇవన్నీ ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురం మండలంలోని భైరవకోనలో దర్శనమిస్తున్నాయి. ఎత్తైన కొండల పైనుంచి జాలువారుతున్న జలపాతం అందరినీ ఆకట్టుకుంటోంది.
భైరవకోన జలపాత అందాలు