ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలంలోని పలు గ్రామాలకు చెందిన రౌడీ షీటర్లకు పోలీసులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అద్దంకి సీఐ హైమారావు ఆధ్వర్యంలో.. ఫ్యాక్షన్ వద్దు శాంతి ముద్దు అంటూ రౌడీలతో నినాదాలు చేయించారు. ఫ్యాక్షన్ వల్ల వారి కుటుంబాలకు జరిగే నష్టాల గురించి వివరించారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు.
ఫ్యాక్షన్ వద్దు.. శాంతి ముద్దు - సంతమాగులూరు
ఫ్యాక్షన్ వల్ల కుటుంబాలు రోడ్డున పడతాయని.. దాన్ని వదిలేసి ఆనందంగా జీవించాలని పోలీసులు రౌడీషీటర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఫ్యాక్షన్ వద్దు.. శాంతి ముద్దు