ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ.. ప్రమాదరహిత శనివారంగా పాటిద్దాం' - ప్రతి శనివారం రోడ్డు ప్రమాద రహిత దినంగా పాటించాలి

ప్రతి శనివారం రోడ్డు ప్రమాదరహిత దినం(no accident day)గా పాటించాలని ఎస్పీ మలికా గార్గ్‌ ఆదేశించారు. శనివారం ఒంగోలు నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి వాహన చోదకులకు అవగాహన కల్పించారు. శిరస్త్రాణం ధరించినవారికి పూలు, చాక్లెట్లు ఇచ్చి అభినందనలు తెలిపారు.

NO ACCIDENT DAY
ప్రతి శనివారం రోడ్డు ప్రమాద రహిత దినంగా పాటించాలి

By

Published : Aug 22, 2021, 10:45 AM IST

ప్రకాశం జిల్లాలో 'ప్రతి శనివారం ప్రమాదరహిత దినం' అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. వాహనచోదకులు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ.. ప్రమాదాలు నివారణకు తమవంతు బాధ్యత వహించాలని జిల్లా ఎస్పీ మలికా గర్గ్ అన్నారు. వాహనదారుల నిర్లక్ష్యం వల్ల ఎదుటివారికి కూడా ప్రమాదం పొంచి ఉందన్నారు. జిల్లాలో ప్రతి శనివారం ప్రమాదరహిత దినోత్సవాన్ని(no accidents day) నిర్వహించాలని ఎస్పీ సూచించారు. ఈ సందర్బంగా ఒంగోలులోని సౌత్ బై పాస్ జంక్షన్​లో తనిఖీలు చేపట్టారు. వాహనదారులకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించిన పలువురికి చాకెట్లు, గులాబీ పూలు ఇచ్చి అభినందించారు.

అనంతరం ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ.. ప్రమాదరహిత జిల్లాగా ఉంచడానికి తమవంతు కృషిచేస్తామని వాహనదారుల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా అడిషనల్ ఎస్పీ రవిచంద్ర, ఒంగోలు ట్రాఫిక్ డీఎస్పీ పి. మల్లికార్జునరావు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details