ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మంత్రి తనయుడి ప్రోద్భంలంతోనే దాడులు' - attacks on Minister

ప్రకాశం జిల్లా ఒంగోలులో తెదేపా నాయకులపై మంత్రి బాలినేని తనయుడు ప్రణీత్ రెడ్డి ప్రోద్బంలతో దాడులు చేస్తున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్థన్ ఆరోపించారు.

జిల్లా తెదేపా అధ్యక్షుడు

By

Published : Aug 26, 2019, 7:41 PM IST

జిల్లా తెదేపా అధ్యక్షుడు

మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి తనయుడు ప్రణీత్ రెడ్డి ప్రోద్భలంతోనే ఒంగోలులో తెదేపా నాయకులపై దాడులు జరుగుతున్నాయని జిల్లా తెదేపా అధ్యక్షుడు దామచర్ల జనార్థన్ ఆరోపించారు. పార్టీ నగర అధ్యక్షుడు కటారి నాగేశ్వరరావుపై దాడి చేసిన వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేయాలని కోరుతూ ఎస్పీ సిద్దార్ద్ కౌశల్ కి ఫిర్యాదు చేశారు. ఇదే సంస్కృతి కొనసాగిస్తే తమ నాయకులను, కార్యకర్తలను ఎలా కాపాడుకోవాలో తెలుసని తెదేపా నేతలు అన్నారు.

ABOUT THE AUTHOR

...view details