ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలంలోని కుందుర్రులో అతి ప్రాచీన సమాధులు బయట పడ్డాయి. కుందుర్రు నుంచి నాగులవరం మార్గంలో బొగ్గులుకొండ అంచుకున్న వ్యవసాయ భూమిలో రైతు యడ్లపల్లి మురళిభూమి దున్నుతుండగా ఇవి కనిపించాయి. ఓ చోట పొడవాటి బండ రాయి.. మరో సమాధిలో ఎముకలు, మట్టి కుండ అవశేషాలు లభించాయి.
ప్రకాశం జిల్లాలో బయటపడ్డ.. ప్రాచీన సమాధులు - కుందుర్రులో బయటపడ్డ ప్రాచీణ సమాధులు
ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలంలోని కుందుర్రులో పొలం దున్నుతుండగా అతి ప్రాచీన సమాధులు బయట పడ్డాయి. ఓ చోట పొడవాటి బండ రాయి.. మరో సమాధిలో ఎముకలు, మట్టి కుండ అవశేషాలు కనిపించారు.
సమాధులు క్రీస్తు పూర్వం 8వ శతాబ్దం శిలాయుగం నాటివిగా అద్దంకికి చెందిన చారిత్రక పరిశోధకుడు జ్యోతి చంద్రమౌళి తెలిపారు. అప్పట్లో గిరిజన తెగలు నీటిసదుపాయం ఉన్న ప్రాంతంలో, సమీప కొండల పైన నివసించే వారని తెలిపారు. ఎముక పొడవును బట్టి ఏడు అడుగుల భారీ కాయంతో అప్పటి వారు ఉండేవారని పేర్కొన్నారు. తెగలో చనిపోయిన వారి మృతదేహాలను భారీ బండరాతి సమాధిలో కొండ అంచు భాగంలో భద్రపరిచేవారని ఆయన వివరించారు.
ఇదీ చదవండి: జాతీయ విద్యా విధానం-2020ని స్వాగతిస్తున్నా: చంద్రబాబు