ప్రముఖ సినీ నాటక రచయిత ఎం.వీ.ఎస్. హరినాథరావు 71 వ జయంతి ఉత్సవాలు మూడురోజుల పాటు ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించనున్నట్లు అభినయ సాంస్కృతిక నాటక రంగ సంస్థ అధ్యక్షుడు అన్నమనేని ప్రసాద్ అన్నారు. నాటకాన్నీ బ్రతికించడం కోసం, నటులను ప్రోత్సహించడం కోసం హరినాథరావు ఏర్పాటుచేసిన అభినయ సాంస్కృతిక నాటక రంగ సంస్థ ఆధ్వర్యంలో నాటకోత్సవాలను ప్రదర్శంచనున్నట్టు తెలిపారు. ఒంగోలులోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో 26, 27, 28 తేదీల్లో మార్గదర్శి కళావీక్షణం, కెరటాలు నాటకంతోపాటు చివరి రోజు హరినాథరావు స్వయంగా రచించగా, ఉదయ్ భాగవతులు దర్శకత్వం వహించిన కన్యావరశుల్కం నాటకం మొదటి ప్రదర్శన ఇవ్వనున్నట్లు వివరించారు. కళాభిమానులంతా ఈ నాటకోత్సవాలను ఆదరించాలని ఆకాంక్షించారు.
రేపటి నుంచే ప్రారంభం.... అందరూ ఆహ్వానితులే....
నటులను ప్రోత్సహించి, గొప్ప కళాకారులుగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ఎం.వీ.ఎస్. హరినాథరావుగారు మెదలుపెట్టిన అభినయ సాంస్కృతిక నాటక రంగ సంస్థ ఆధ్వర్యంలో నాటకోత్సవాలు జరగనున్నాయి. ఈ నెల 26,27,28 తేదీల్లో జరిగే ఈ నాటక ప్రదర్శనలకు అందరూ ఆహ్వానితులే.....
అభినయ సాంస్కృతిక నాటక రంగ ఉత్సవాలు