ఆధార్ కేంద్రాల వద్ద బారులు తీరిన ప్రజలు - problems
ఆధార్ కేంద్రాల వద్ద జనం బారులు తీరారు. రేషన్‌కార్డుల్లో చిన్నపిల్లల ఆధార్‌కార్డుల నమోదుకు తిప్పలు తప్పడం లేదు. ఆధార్ సెంటర్లు పెంచాలని ప్రజలు కోరుతున్నారు.
aadhar-card-problems
రేషన్ కార్డుల్లో చిన్నపిల్లలకు సంబంధించి..ఆధార్ కార్డుల ఎంట్రీ కాక....ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు.ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఆధార్ నమోదు కేంద్రాల వద్ద జనాలు బారులు తీరారు.టోకెన్లు కోసం ఎగబడ్డారు.పాఠశాలలు,కళాశాలలు మానేసి ఆధార్ సెంటర్ల వద్ద ఉండాల్సి వస్తోందని విద్యార్థులు చెబుతున్నారు.పొలాల్లో పనులు మానుకుని వచ్చామని దీనిపై ప్రభుత్వం స్పందించి..ఆధార్ సెంటర్లు పెంచాలని రైతులు కోరుతున్నారు.