ప్రకాశం జిల్లా ఉలవపాడు నుంచి నెల్లూరు జిల్లా కావలి వరకు.. 30 కిలోమీటర్ల రైల్వే మూడో లైన్ పనులు పూర్తయ్యాయి. ట్రయల్ రన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ప్రత్యేక రైలు 120 కిలోమీటర్ల వేగంతో మూడో లైన్‌లో దూసుకుపోయింది. ట్రయల్ రన్ విజయంతం కావడం పట్ల అధికారులు ఆనందం వ్యక్తం చేశారు. పక్కనే అప్ మెయిన్‌లైన్‌లో ట్రయల్ జరుగుతుండగా.. సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రావడంతో.. రెండు రైళ్లు పోటీపడుతున్నట్లు అనిపించింది. సూపర్ ఫాస్ట్ రైలు కన్నా.. ప్రత్యేక రైలు వేగంగా ముందుకు దూసుకెళ్లింది.
కావలి - ఉలవపాడు రైల్వే మూడో లైన్ పనులు పూర్తి - south central railway news
ప్రకాశం జిల్లా ఉలవపాడు నుంచి నెల్లూరు జిల్లా కావలి వరకు.. 30 కిలోమీటర్ల రైల్వే మూడో లైన్ పనులు పూర్తయ్యాయి. ఈ మేరకు అధికారులు ట్రయల్ రన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు.
kavali to ulavapadu railway works