ప్రకాశం జిల్లా ఒంగోలులో పసుపు-కుంకుమ, ఎన్టీఆర్ ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. రాష్ట్ర అభివృద్ధిలో తాము సైతం అంటూ డ్వాక్రా మహిళలు, వృద్ధులు, వికలాంగులు ఔదార్యం చాటుకున్నారు. రాజధాని నిర్మాణానికి తమ వంతు సాయం చేస్తామంటూ విరాళాలు అందించారు. స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన సందర్భంలోనే.. పలువురు మహిళలు రాజధాని నిర్మాణానికి సహాయం చేశారు. ఒక్కో గ్రూపు సభ్యులు 3 వేల నుంచి 5వేల వరకు విరాళంగా ఇచ్చారు. ఓ దివ్యాంగుడు తనకు వచ్చిన పింఛను డబ్బులు వితరణ చేశారు. సుమారు 100 మంది మహిళలు తమకు వీలైనంత సహాయాన్ని అందజేశారు. గొప్ప మనసు చాటుకున్న మహిళలు, వృద్ధులు, దివ్యాంగులను జనార్దన్ ఘనంగా సత్కరించారు.