ప్రపంచ కప్ ప్రారంభం కావడంతో క్రికెట్ బెట్టింగ్ పై ప్రత్యేక దృష్టిసారించినట్లు నెల్లూరు జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి స్పష్టం చేశారు. ఎక్కడైనా క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్నట్లు తమకు సమాచారం ఇస్తే... వారి వివరాలు గోప్యంగా ఉంచి చర్యలు తీసుకుంటామన్నారు. ఎక్కువగా యువత బెట్టింగుల పట్ల ఆకర్షితులవుతున్నారని వ్యాఖ్యనించారు. బెట్టింగ్‌కు పాల్పడితే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడితే క్రిమినల్ కేసులు : నెల్లూరు ఎస్పీ - sp
క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని నెల్లూరు జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి హెచ్చరించారు. అసాంఘిక కార్యకలపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్నారు.
క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడితే క్రిమినల్ కేసులు