రెండు దశాబ్దాలకు పైగా సాగు చేసుకుంటున్న తమ పొలాలను అటవీ అధికారులు అక్రమంగా స్వాధీనం చేసుకుంటున్నారని నెల్లూరు జిల్లా నారాయణపురం గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతులు నిరసన వ్యక్తం చేశారు. 1997లో 162 ఎకరాలు, 2013 లో 149 ఎకరాలను ప్రభుత్వం 250 మంది రైతులకు పంపిణీ చేసిందన్నారు. అప్పటి నుంచి తాము బ్యాంకు రుణాలను సైతం తీసుకుని పంట సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని తెలిపారు. అటవీ అధికారులు వచ్చి భూమలు ప్రభుత్వానివంటూ తమ పొలాలను బలవంతంగా లాక్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయకుంటే తమకు ఆత్మహత్యలే శరణ్యమని వాపోతున్నారు.
'భూములు లాక్కుంటే... ఆత్మహత్యలే శరణ్యం' - nellor
రెండు దశాబ్దాలకు పైగా సాగు చేసుకుంటున్న తమ పొలాలను అటవీ అధికారులు అక్రమంగా స్వాధీనం చేసుకుంటున్నారంటూ నెల్లూరు రైతులు కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. అటవీ అధికారులను తక్షణమే కట్టడి చేయాలని... లేకుంటే తమకు ఆత్మహత్యలే శరణ్యమని అన్నదాతలు వాపోయారు.
'భూములు లాక్కుంటే ఆత్మహత్యలే శరణ్యం'