నెల్లూరు జిల్లాలో ఎడగారు సీజన్లో పెన్నా డెల్టా ఆయకట్టు కింద లక్షా ఎనభై వేల ఎకరాల్లో మాత్రమే వరి సాగు చేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని జలవనరుల శాఖ సెంట్రల్ డివిజన్ ఈ ఈ కృష్ణ మోహన్ తెలిపారు. రైతులు మాత్రం ఇప్పటికే రెండు లక్షల ఐదు వేల ఎకరాల సాగు చేశారని, దీంతో నీటి కొరత ఏర్పడుతోందని ఆయన తెలిపారు. రైతులు ఇక నాట్లు వేయకుంటే మంచిదని ఆయన అన్నారు. అధికారులు చెప్పినా వినకుండా చాలామంది రైతులు వరి నాట్లు వేస్తున్నారని, తర్వాత చాలా నీటి కొరత ఏర్పడుతుందన్నారు.
'నీటి కొరత ఉంది.. రైతులు నాట్లు వేయవద్దు'
భవిష్యత్లో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున ఇప్పటికే నారు పోసి సిద్ధంగా ఉన్న రైతులు నాట్లు వేయవద్దని జలవనరుల శాఖ సెంట్రల్ డివిజన్ ఈఈ కృష్ణ మోహన్ తెలిపారు. నీటి కొరత ఉండటం వలన రైతులు వేయాల్సిన పంటలపై ఆయన రైతులకు పలు సూచనలు ఇచ్చారు. నీరు సరిపడా లేనందున ఆరుతడి పద్ధతిలో వరి సాగు చేస్తే మంచి దిగుబడులు వస్తాయని, రైతులు ఆ వైపు మొగ్గు చూపాలన్నారు.
జలవనరుల శాఖ సెంట్రల్ డివిజన్ ఈ ఈ కృష్ణ మోహన్