నెల్లూరు రంగుల మయం - in
నెల్లూరు నగరంలో ఎఫ్.ఎమ్. రేడియోను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. దూరదర్శన్ దేశ, విదేశాల్లో ఎంతో ప్రాచుర్యం పొందిందని కొనియాడారు.
వెంకయ్య నాయుడు
నెల్లూరులో ఎఫ్.ఎమ్.(రెయిన్బోతో మీజీవితం రంగులమయం) రేడియోను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. నగరంలోని తెలుగుగంగ కాలనీ వద్ద రేడియో స్టేషన్నిర్మించారు. దూరదర్శన్ దేశ, విదేశాల్లో ఎంతో ప్రాచుర్యం పొందిందని కొనియాడారు. ఆయా రాష్ట్ర భాషలోనే పరిపాలన సాగాల్సిన అవసరం ఉందన్నారు. మాతృభాషను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. కార్యక్రమంలో మంత్రి నారాయణ తదితరులు పాల్గొన్నారు.
Last Updated : Feb 21, 2019, 2:08 PM IST