ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైతు నుంచి రూ.1.94 లక్షలు అపహరణ - unknown person theft money from farmer at Naidupeta nellore district

నెల్లూరు జిల్లా నాయుడుపేటలో బ్యాంకు నుంచి వెళ్తున్న ఓ రైతు నుంచి రూ. 1.94 లక్షల నగదును దుండగుడు చోరీ చేశాడు. స్థానికంగా ఉన్న సీసీ కెమోరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

unknown-person-theft-money-from-farmer-at-naidupeta-nellore-district
రైతు నుంచి 1.94 లక్షల రూపాయలు అపహరణ

By

Published : Oct 7, 2020, 9:39 PM IST

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోట మండలం రుద్రవరం గ్రామానికి చెందిన రైతు నాగూర్ బాషా.. నాయుడుపేట ఇండియన్ బ్యాంకులో బంగారం ఆభరణాలు పెట్టి రూ. 1.94 లక్షలు నగదు తీసుకున్నాడు. ఆ డబ్బుతో వెళ్తున్న అతనికి బ్యాంకు ఎదురుగా తెలిసిన వాళ్లు కనిపించగా రోడ్డు పక్కకు బైకు నిలిపి శీతలపానీయం తాగేందుకు వెళ్లారు.

ఇంతలోనే గుర్తు తెలియని వ్యక్తి మోటార్ సైకిల్​లో ఉన్న డబ్బుల సంచిని మాయం చేశాడు. అప్పులు తీర్చేందుకు నగలు కుదువ పెట్టి తెచ్చిన డబ్బును అపహరించడం వల్ల ఆ రైతన్న కన్నీరుపెట్టుకున్నాడు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు చేసు నమోదు చేశారు. సీసీ కెమోరాల్లో చోరీకి పాల్పడిన దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నందున వాటి ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details