accident: వెంకటగిరిలో ఘోరం...2 ద్విచక్రవాహనాలు ఢీకొని ఇద్దరు మృతి - నెల్లూరు జిల్లా ప్రధాన వార్తలు
16:45 August 23
two persons were killed in road accident in nellore district
నెల్లూరు జిల్లా వెంకటగిరిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న 2 ద్విచక్రవాహనాలు ఢీకొని ఇద్దరు మృతి చెందారు. తిరుపతి వెళ్లే రహదారిలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ గోడౌం వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో శ్రీకాళహస్తి మండలం కలవగుంట గ్రామానికి చెందిన మునికృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. వెంకటగిరికి చెందిన వెంకటేశ్వర్లుకు తీవ్ర గాయాలు కాగా స్థానిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే అతను అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనలో మరో మహిళకు కూడా గాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: