ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

30 ఏళ్ల తర్వాత సోమశిలకు జలకళ... 2 గేట్లు ఎత్తి నీటి విడుదల - somashila project latest news

నెల్లూరు జిల్లా సోమశిల జలాశయం నిండుకుండలా కళకళలాడుతోంది.నిర్మాణం చేపట్టిన 30ఏళ్ల తరువాత తొలిసారిగా పూర్తిస్థాయి నీటిమట్టంతో దర్శనమిస్తోంది. 4 గేట్లు ఎత్తి 20వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

సోమశిల జలాశయం

By

Published : Oct 30, 2019, 6:35 PM IST

Updated : Oct 30, 2019, 10:23 PM IST

30 ఏళ్ల తర్వాత సోమశిలకు జలకళ

నెల్లూరు జిల్లా సోమశిల జలాశయం నిండుకుండలా కళకళలాడుతోంది. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు జలకళ సంతరించుకుంది. జలాశయం పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 77.500 టీఎంసీలకు చేరింది. రాయలసీమ ప్రాంతాల్లో భారీగా కురిసిన వర్షాలకు... జలాశయానికి 29వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దిగువకు 12 వేల క్యూసెక్కులు వదులుతున్నారు. సోమశిల నుంచి కండలేరు జలాశయానికి 9000 వేల క్యూసెక్కులు, ఉత్తర కాలువకు 600 క్యూసెక్కులు, దక్షిణ కాలువకు 150 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పెన్నా నది ప్రధాన హెడ్‌రెగ్యులేటర్ అయిన వైఎస్ఆర్ జిల్లా ఆదినిమ్మాయపల్లి వద్ద సుమారు 60 వేల క్యూసెక్కుల వంతున వరద నమోదైంది. సోమశిల జలాశయం 4 ప్రధాన గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు అధికారులు. 20 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

Last Updated : Oct 30, 2019, 10:23 PM IST

ABOUT THE AUTHOR

...view details