నెల్లూరు జిల్లా వెంకటగిరిలో విషాదం జరిగింది. పట్టణంలోని కైవల్య నదిలోకి దిగి ఇద్దరు బాలురు మృతి చెందారు. గాలిపటం నదిలో పడటంతో ముగ్గరు చిన్నారులు దానికోసం నదిలోకి దిగారు. ఈత రాకపోవటంతో వారు నీటిలో చిక్కుకున్నారు. చిన్నారులు మునిగిపోతుండగా స్థానికులు గమనించి నీటిలోకి దిగి ఓ బాలుణ్ని రక్షించగలిగారు. మిగతా ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మృతులు అభి(7), సురేష్(15)లుగా గుర్తించారు. మృతదేహాలను అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం వెంకటగిరిలోని సామాజిక ఆరోగ్యకేంద్రానికి తరలించారు. తమ బిడ్డల మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
పతంగి కోసం వెళ్లి... ప్రాణాలు కోల్పోయారు..! - kite news
నదిలో పడిన గాలిపటాన్ని తీసుకొచ్చేందుకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. స్థానికుల సహాయంతో మరో బాలుడు సురక్షితంగా బయటపడ్డాడు. పండుగ పూట చిన్నారుల మృతితో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
two-boys-were-killed-when-they-plunged-into-the-river-for-kites