ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అరుదైన ఔషధ మొక్కలు.. ఆయనకు నేస్తాలు - fill

మొక్కలు పెంచడం ఓ కళ. ఇది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఇందులో వైవిధ్యం చూపించే వాళ్లూ ఉన్నారు. అలాంటి వ్యక్తే నెల్లూరుజిల్లా నాయుడుపేటలోని సత్యనారాయణ.

సత్యనారాయణ ఇంట్లో పెంచిన మొక్కలు

By

Published : May 10, 2019, 10:28 AM IST

Updated : May 10, 2019, 11:58 AM IST

మొక్కలకు ఆయనకు నేస్తాలు

పచ్చని చెట్లు... చూస్తున్నంత సేపు చూడాలనిపిస్తాయి. మనసుకు ఉల్లాసాన్ని ఉత్సాహాన్నిస్తాయి. అందుకే ఉన్న కొద్ది ప్రదేశంలోనే మొక్కలు పెంచుకొని ఆనందం పొందేవారెందరినో నిత్యం చూస్తుంటాం. ఇంకొందరు ఇంటి మిద్దెనే వనంలా మార్చేస్తుంటారు. అలాంటి వ్యక్తుల్లో ఒకరు నెల్లూరు జిల్లా నాయుడుపేట బజారు వీధికి చెందిన డాక్టర్ సత్యనారాయణ. ఈయన ఏకంగా 1200 రకాల ఔషధ మొక్కలు పెంచుతున్నారు. సత్యనారాయణ పదేళ్లుగా మొక్కలు పెంచుతున్నారు. ఖాళీ సమయంలో వీటి సంరక్షణే ఈయన బాధ్యత. ఇతర దేశాల నుంచీ దిగుమతి చేసుకున్నారు. ఎదురు బొంగుల్లో చిన్న చిన్న కుండీల్లో ఎక్కువ కాలం పెరిగే వాటిని పెంచుతూ భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నారు. తీగల మొక్కల్లో అరుదైన రకాలు ఆయన ఇంటివద్ద కనిపిస్తాయి. ఆయన ఇంటినే ఓ ఉద్యానవనంలా మార్చేశారీ సత్యనారాయణ.

Last Updated : May 10, 2019, 11:58 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details