డీసీపల్లి కేంద్రంలో ముగిసిన పొగాకు కొనుగోళ్లు - purchase
డీసీ పల్లిని పొగాకు వేలం కేంద్రంలో కొనుగోళ్లు నిన్నటితో ముగిశాయి. ఈ సంవత్సరం 5.58 మిలియన్ల కేజీల పొగాకు విక్రయించినట్టు అధికారులు తెలిపారు.
నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం డీసీపల్లి పొగాకు వేలం కేంద్రంలో శుక్రవారంతో పొగాకు కొనుగోళ్లు అధికారికంగా ముగిశాయని వేలం నిర్వహణాధికారి లక్ష్మణరావు తెలిపారు. ఈ ఏడాదికి డీసీ పల్లి వేలం కేంద్రంలో గరిష్ఠ ధర 198 రూపాయలుగాను, కనిష్ఠ ధర 16 రూపాయలుగా నమోదైందని అన్నారు .ఈ ఏడాది అధికారికంగా 5.58 మిలియన్ల కేజీల పొగాకును అమ్మినట్టు ఆయన పేర్కొన్నారు. గతేడాది కంటే ఈ ఏడాదిలో గ్రేడు అధికంగా కొనుగోలు చేశామని వెల్లడించారు. అలాగే రైతులు ప్రకృతి వ్యవసాయంపై ఖర్చులు తగ్గించి ఎక్కువ దిగుబడి నాణ్యత గల పొగాకును పండిస్తే గిట్టుబాటు ధర సాధ్యమవుతుందని సూచించారు.