నెల్లూరు జిల్లా సంగం మండలం అన్నారెడ్డిపాలెంలో దారుణం జరిగింది. మతిస్థితిమితం లేని ఓ యువతిపై ముగ్గురు యువకులు అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. మద్యం మత్తులో ఉన్న వారు ఆ అమ్మాయిని ఊరి చివర్లో ఉన్న ముళ్ల పొదల్లోకి తీసుకెళ్లి ఈ ఆఘాయిత్యానికి ఒడిగట్టారు. యువతి కేకలు పెట్టటంతో అటుగా వెళ్తున్న వ్యక్తి వచ్చేసరికి ఆ యువకులు పారిపోయారు. గ్రామస్థులు వారిలో ఒకరిని పట్టుకుని పోలీసులకు అప్పగించగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ యువతిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
మతిస్థిమితం లేని యువతిపై ముగ్గురు యువకుల ఘాతుకం - అన్నారెడ్డిపాలెం
మద్యం మత్తులో ముగ్గురు యువకులు దారుణానికి పాల్పడ్డారు. తమ గ్రామంలో మతిస్థిమితం లేని యువతిపై అత్యాచారయత్నానికి ప్రయత్నించారు. సమయానికి గ్రామస్థులు రావటంతో ఘోరం తప్పింది. ఈ ఘటన నెల్లూరు జిల్లాలోని అన్నారెడ్డిపాలెంలో జరిగింది.
అఘాయిత్యం