ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

4 రోజులైంది అడవిలో తప్పిపోయి.. ఎక్కడున్నాడో.. ఎలా ఉన్నాడో..!

అడవికి వెళ్తున్న తండ్రి వెనకాలే.. కుమారుడూ వెళ్లాడు. అలా వెళుతూ వెళుతూ మార్గమధ్యంలో తప్పిపోయాడు. గమనించని బాలుడి తండ్రి ముందుకు సాగిపోయాడు. కొద్దిసేపటి తర్వాత బాలుడు తప్పిపోయాడని గమనించిన తండ్రి... చిన్నారి కోసం తీవ్రంగా వెతికాడు. అయినప్పటికీ లాభం లేకపోవడంతో పోలీసులను అశ్రయించాడు. వారు నిరంతరం శ్రమించినా... బాలుడి జాడ దొరకడం లేదు.

missing child in forest
అడవిలో తప్పిపోయిన చిన్నారి

By

Published : Jul 4, 2021, 8:26 PM IST

నెల్లూరు జిల్లా కలువాయి మండలం ఉయ్యాల పల్లి గ్రామానికి చెందిన బుజ్జయ్య, వరలక్ష్మి అనే గిరిజన దంపతుల మూడేళ్ల కుమారుడు సంజూ... 4 రోజుల క్రితం తండ్రితో పాటు గొర్రెలను మేపేందుకు అడవికి వెళ్లాడు. తండ్రితో పాటే నడుస్తున్న బాలుడు కొద్ది దూరం వెళ్లాక తప్పిపోయాడు. గమనించిన తండ్రి చుట్టూ ఎంత వెతికినా దొరక్కపోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

పొదలకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గంగాధర్ ఎస్ఐ ఆంజనేయులు ఆధ్వర్యంలో సుమారు 100 మంది పోలీసు సిబ్బంది మరో వంద మంది గ్రామస్థులు మూడు రోజులుగా అటవీ ప్రాంతమంతా వెతికారు. రెండు రోజులపాటు డ్రోన్ కెమెరాతో కూడా పరిశీలించారు. అయినా ఫలితం లేదు. నేటికీ పోలీస్​ సిబ్బంది తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నారు. తమ బిడ్డ ఎక్కడో ఓ చోట జీవించే ఉంటాడని బాలుని తల్లిదండ్రులు ఆశాభావం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details