నెల్లూరు నగరంలో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. రెండు స్టేషన్ల పరిధిలో అనేక దొంగతనాలకు పాల్పడ్డారు. వీరి నుంచి 6 లక్షల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వేదాయపాలెం పోలీసు స్టేషన్ పరిధిలో శ్రీనివాస రెడ్డి, గవాస్కర్ అనే చైన్ స్నాచర్లను అరెస్టు చేసి 5 లక్షల విలువైన 26 సవర్ల బంగారాన్ని పట్టుకున్నారు. దొంగిలించిన నగలను ఓ ఫైనాన్స్ సంస్థలో తనఖా పెట్టినట్లు డీఎస్పీ శ్రీనివాసులరెడ్డి తెలిపారు. చిన్న బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రవల్లిక అనే దొంగను అరెస్ట్ చేసి, లక్ష రూపాయల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
నెల్లూరులో ముగ్గురు దొంగల అరెస్టు - gold seize
నెల్లూరు నగర పరిధిలో ముగ్గురు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 6 లక్షల విలువచేసే బంగారు అభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
దొంగలు అరెస్టు