ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చోరీలకు పాల్పడుతున్న తండ్రి కొడుకులు అరెస్ట్.. - thief son and father

నెల్లూరు, తిరుపతి ప్రాంతాలలో ఆటోలు, ద్విచక్రవాహనాల చోరీలకు పాల్పడుతున్న తండ్రి కొడుకులను నెల్లూరు పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి పెద్ద సంఖ్యలో వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

చోరీలకు పాల్పడుతున్న తండ్రి కొడుకులు అరెస్ట్

By

Published : Jun 2, 2019, 5:12 AM IST

ఆటోలు, మోటార్ సైకిళ్లను చోరీ చేసే తండ్రి కొడుకులను నెల్లూరు పోలీసులు అరెస్టు చేసారు. వారి నుంచి 22 లక్షల రూపాయల విలువచేసే 10 ఆటోలు, ఎనిమిది మోటారు సైకిళ్ల తోపాటు తొమ్మిదిన్నర సవర్ల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని ముదివర్తిపాళెం గ్రామానికి చెందిన సంతోష్, సందీప్ లు తండ్రి కొడుకులు... వీరు గత కొంతకాలంగా ఆటోలు, మోటర్ సైకిళ్లను చోరీ చేస్తూ.. తప్పించుకు తిరుగుతున్నారు. ఆటోల చోరీలపై ఫిర్యాదులు అధికం కావడంతో నిఘా ఉంచిన పోలీసులు వీరిని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరుతోపాటు తిరుపతి ప్రాంతంలోను వీరు చోరీలకు పాల్పడినట్లు జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి తెలిపారు. గతంలో వీరిపై అనేక కేసులు ఉండటంతో పలుమార్లు జైలుకు కూడా వెళ్లారని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details