అర్ధరాత్రి వేళ... బాలుడు కిడ్నాప్ కలకలం
నెల్లూరు జిల్లాలో నిన్న అర్ధరాత్రి బాలుడి కిడ్నాప్ కలకలం స్పష్టించింది. బైక్‌పై వచ్చిన దుండగులు ఏడో తరగతి చదువుతున్న చిన్నారిని అపహరించారు.
కిడ్నాప్
నెల్లూరు జిల్లా చేజర్ల మండలం కాకివాయలో నిన్న బాలుడు కిడ్నాప్‌కు గురయ్యాడు. రాజేశ్(13) అనే బాలుడు అర్ధరాత్రి రోడ్డుపై ఉండగా.. బైక్‌పై వచ్చిన దుండగులు అతన్ని అపహరించారు. బాలుడు కేకలు వేస్తున్నా.. వదలకుండా తీసుకెళ్లారు. చిన్నారి తల్లిదండ్రులు చేజర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చివరికి పెంచల కోన అటవీ ప్రాంతం వద్ద బాలుడు రాజేశ్‌ను కిడ్నాపర్లు వదిలివెళ్లారు.బిల్లుపాడు ప్రాథమిక పాఠశాలలో బాధితుడు రాజేశ్ ఏడో తరగతి చదువుతున్నాడు.