ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 21, 2022, 6:51 AM IST

ETV Bharat / state

Mahanadu: ఈ ఏడాది ఒక్కరోజే 'తెలుగుదేశం మహానాడు'

TDP Mahanadu News: 'తెలుగుదేశం మహానాడు' ఈసారి మే 28న ఒక్కరోజే నిర్వహించనున్నారు. ఒంగోలు ప్రాంతంలో నీటి ఎద్దడి, ఎండల తీవ్రత దృష్ట్యా ఒక్క రోజుకే పరిమితం చేయాలని నిర్ణయించినట్లు పార్టీ నేతలు తెలిపారు.

తెలుగుదేశం మహానాడు
తెలుగుదేశం మహానాడు

'తెలుగుదేశం మహానాడు' ఈసారి మే 28న ఒక్కరోజే నిర్వహించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఒంగోలు ప్రాంతంలో నీటి ఎద్దడి, ఎండల తీవ్రత దృష్ట్యా ఒక్క రోజుకే పరిమితం చేయాలని నిర్ణయించినట్లు పార్టీ నేతలు తెలిపారు. మహానాడుకు ముందురోజు మే 27న.. 4 వేల నుంచి 5 వేల మంది పార్టీ ప్రతినిధులతో మహానాడు వేదిక వద్దే విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తారు. ఈ భేటీకి ఆహ్వానితులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. 28న జరిగే మహానాడుకు మాత్రం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మద్దతుదారులు సహా ఎవరైనా హాజరు కావొచ్చు. ఆ రోజు భారీ బహిరంగ సభ నిర్వహించనున్న తెలుగుదేశం.. ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాల్ని ఈ సభలోనే ప్రారంభించనుంది. సంవత్సరంపాటు శత జయంతి ఉత్సవాలు నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు.

28న ఎన్టీఆర్‌ జయంతిని పురస్కరించుకుని మహానాడును ఏటా మే 27 నుంచి 29 వరకు మూడు రోజులపాటు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. గత రెండేళ్లుగా కొవిడ్‌ కారణంగా ఆన్‌లైన్‌లోనే మహానాడు నిర్వహించారు. అయితే ఈ ఏడాది ఒంగోలు ప్రాంతంలో నిర్వహించే మహానాడును పరిస్థితుల ప్రభావం వల్ల ఒక్క రోజుకే పరిమితం చేశారు. ఈ ఏడాది మహానాడు కార్యక్రమాన్ని ఒంగోలు సమీపంలో నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే.

ఇదీ చదవండి:ఈ ఏడాది ఒంగోలులో తెదేపా మహానాడు: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details