Somireddy Chandramohan Reddy: వ్యవసాయమంటే ఏంటో తెలియని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డికి.. రైతుల భూములు దోచుకోవడం మాత్రమే తెలుసునని... తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. రైతుల సమస్యలు పట్టని కాకాణి.. కాకమ్మ కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు. వైకాపా హయాంలో కరవు మండలాలే లేవని... అసత్యాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన గణాంకాల ప్రకారమే 2020లో 161 కరవు మండలాలున్నాయన్న విషయం కూడా మంత్రికి తెలియదా? అని దుయ్యబట్టారు.
వ్యవసాయమంటే ఏంటో తెలియని వ్యక్తి ఆ శాఖకు మంత్రి కాకాణి: సోమిరెడ్డి
TDP Leaders on ysrcp: వైకాపా ప్రభుత్వంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెదేపా నేతలు ఆరోపించారు. వర్షాల కారణంగా రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగొలు చేయాలని డిమాండ్ చేశారు. జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని పేర్కొన్నారు. రైతుల పెట్టుబడులు రెట్టింపు అయినప్పటికీ కనీసం మద్దతు ధర సైతం రావడంలేదని ఆవేదనవ్యక్తం చేశారు.
Kala Venkata Rao: వైకాపా ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో రైతులు సర్వనాశనం అయిపోయారని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావు ఆరోపించారు. ఈ ప్రభుత్వ హయాంలో పండించిన పంటకు గిట్టుబాటు ధర సైతం రావడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సకాలంలో డబ్బులు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. పెట్టుబడులు రెట్టింపుపైన మద్దతు ధర కనీసం మాత్రం రైతులకు రావడంలేదని అన్నారు. నాగావళి నదిలో నీళ్లు ఉండి కాలువలకు సాగునీరు రాని పరిస్థితి ఉందన్నారు. రైతులు తాము పండించిన పంటను ఎలా వదిలించుకోవాలో ఎదురు చూసే పరిస్థితికి ప్రభుత్వం తీసుకువచ్చిందని కళా విమర్శించారు. నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు వర్షాల కారణంగా రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: