'స్థానిక ఎన్నికలు జరిగి ఉంటే.. ప్రజల పరిస్థితేంటి?' - somi reddy about local elections
రాష్ట్ర ఎన్నికల కమిషనర్, సుప్రీంకోర్టు అడ్డుపడకుండా ఉంటే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే కరోనా వైరస్ ప్రబలి ఎంతో ప్రమాదం జరిగేదని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.
కరోనా కలకలం సృష్టిస్తున్న వేళ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి ఉంటే ప్రజల పరిస్థితి భయంకరంగా ఉండేదని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. 21న ఎంపీటీసీ, జడ్పీటీసీ, 24న మున్సిపల్, 27, 29 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలన్న విషయాన్ని గుర్తుచేశారు. ఒక్క కరోనా కేసు నమోదైనందుకే నెల్లూరులో సినిమా హాళ్లు, మాళ్లు, స్కూళ్లు మూసేసినప్పుడు ఎన్నికల ఎలా నిర్వహిస్తారని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లానని సోమిరెడ్డి పేర్కొన్నారు. అభ్యర్ధనే కావచ్చు, వారికొచ్చిన రిపోర్టులే కావచ్చు..ఎన్నికలను వాయిదా వేస్తూ కమిషనర్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఇప్పటికైనా ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత సీఎం జగన్పై ఉందని హితవు పలికారు.