TAHSILDAR SUSPENDED : నెల్లూరు జిల్లాలో రైతు వద్ద నగదు డిమాండ్ చేసిన ప్రమీల అనే తహసీల్దార్‌పై సస్పెండ్ వేటు పడింది. సుబ్బారెడ్డి అనే రైతు వద్ద నుంచి తహసీల్దార్ నగదు డిమాండ్ చేసిందనే ఆభియోగాలపై అధికారులు విచారణ చేపట్టారు. నిజమని తేలటంతో సస్పెండ్ చేశారు. బుచ్చిరెడ్డి మండలం మినగల్లు గ్రామానికి చెందిన సుబ్బారెడ్డికి 11ఎకరాల భూమి ఆన్లైన్లో నమోదు చేయటానికి.. బుచ్చిరెడ్డి తహసీల్దార్ ప్రమీల నగదు డిమాండ్ చేసిందని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. విచారణలో రైతు వద్ద నుంచి తహసీల్దార్ నగదు డిమాండ్ చేసిన విషయం నిజమని తేలిందని అధికారులు తెలిపారు. దీంతో ఉన్నతాధికారులు ఆమెను సస్పెండ్ చేశారు. ఈమె గతంలో విధులు నిర్వహంచిన దగదర్తి మండలంలోనూ ఆరోపణలున్నాయని ఆ మండల ప్రజలు అంటన్నారు.
విచారణలో తేలిన నిజాలు.. తహసీల్దార్ సస్పెండ్ - Buchireddy Mro Suspend
TAHSILDAR SUSPENDED : రెవెన్యూ శాఖ వైపు చూడలంటేనే ప్రజలు భయపడుతున్నారు. ఆ శాఖతో ఏ చిన్న పనిపడిన అటేండర్ దగ్గరి నుంచి పై స్థాయి అధికారుల వరకు నగదు డిమాండ్ చేస్తున్నారని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వారి భయాలు నిజమానిపించేటట్లు.. నెల్లూరు జిల్లాలోని తహసీల్దార్.. ఓ రైతు నుంచి నగదు డిమాండ్ చేసి సస్పెండ్‌కు గురైంది. ఇంతకీ ఏం జరిగిందంటే..
బుచ్చిరెడ్డి మండలం తహసీల్దార్ సస్పెండ్