నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పురపాలక సంఘంలో వాలంటీర్‌గా పని చేస్తున్న ఓ మహిళ స్థానిక వైకాపా నేతపై ఫిర్యాదు చేసింది. కొన్ని నెలలుగా ఫోన్లు చేస్తూ వేధిస్తున్నాడని పేర్కొంది. నువ్వంటే ఇష్టమంటూ అసభ్యకరంగా మాట్లాడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని తెలిపింది. సదరు నాయకుడు, సమీప బంధువు అని, వరుసకు బాబాయ్ అవుతాడని బాధితురాలు వెల్లడించింది. రాజకీయ పలుకుబడితో వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ప్రేమ పేరుతో వాలంటీర్‌కు వేధింపులు...వైకాపా నేతపై కేసు నమోదు!
ప్రేమ పేరుతో వాలంటీర్‌ను వైకాపా నేత వేధించిన ఘటన సూళ్లూరుపేట పురపాలక సంఘం పరిధిలో జరిగింది. బాధితురాలి ఫిర్యాదు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
sexual harassment