నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులు సొంత గ్రామాలకు పయనమయ్యారు. ఉత్సాహంగా కేరింతలు కొడుతూ... కొందరు వెళ్తుంటే... మరికొందరేమో స్నేహితులకు దూరంగా వెళ్తున్నామనే బాధతో ఇళ్లకు బయలుదేరారు. పాఠశాలలకు సెలవు ప్రకటించడంతో... విద్యార్థులను తీసుకెళ్లేందుకు వారి తల్లిదండ్రులు ఉదయాన్నే వసతి గృహాలకు చేరుకున్నారు. ఇంటికి వెళ్తున్నామన్న సంబరంలో ఎండను లెక్క చేయకుండా... ఏ వాహనాలు అందుబాటులో ఉంటే వాటిలో ప్రయాణిస్తున్నారు.
పాఠశాలలకు సెలవులు... విద్యార్థుల కేరింతలు - sarvepally
పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో విద్యార్థులు ఆనందంగా ఇంటిబాట పట్టారు. వేసవిలో సెలవులను సద్వినియోగం చేసుకుంటామని... కొత్త విషయాలు తెలుసుకుంటామని చిన్నారులు చెబుతున్నారు.
పాఠశాలలకు సెలవులు